TG: అసెంబ్లీ ప్రాంగణంలో పునర్నిర్మించిన కౌన్సిల్ భవనం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహాన్ని గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆవిష్కరించారు. అంతకుముందు అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్న గవర్నర్ శివప్రతాప్ శుక్లా, సీఎం రేవంత్ రెడ్డి మహాత్మాగాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు నివాళులర్పించారు. కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్, మండలి ఛైర్మన్, మంత్రులు, MLAలు, MLCలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.