SDPT: జగదేవపూర్ మండలం బిజీ వెంకటాపూర్ జీపీలో ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మల్టీ పర్పస్ వర్కర్లను సత్కరించారు. గ్రామ సర్పంచ్ చెక్కల పరమేశ్వర్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు, వర్కర్ల సేవలను కొనియాడుతూ వారికి శాలువాలు కప్పి గౌరవించారు. గ్రామాన్ని శుభ్రంగా ఉంచడంలో వీరి పాత్ర చిరస్మరణీయమని సర్పంచ్ పేర్కొన్నారు.