MHBD: కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని చైతన్య నగర్ కాలనీకి చెందిన కొమ్ము ముత్తమ్మ అనే వృద్ధురాలు ఇంటి నుంచి బయటకు రాగా, అక్కడే ఉన్న వీధి కుక్కలు దాడి చేయడంతో కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వృద్ధురాలిని ఆస్పుత్రికి తరలించారు. నెల రోజుల్లో నలుగురు వ్యక్తులపై కుక్కలు దాడి చేయడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.