MBNR: మిడ్జిల్ మండలం బోయినపల్లిలోని విజయ డైరీ పాల శీతలీకరణ కేంద్రాన్ని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మరియు కలెక్టర్ ఖుష్బూ గుప్తా సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రం పనితీరును పరిశీలించి, పాడి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పౌష్టికాహారం మరియు పాడి అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వారు పేర్కొన్నారు.