AP: పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి మంత్రి DSBV స్వామి నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు త్యాగఫలమే ఆంధ్ర రాష్ట్ర అవతరణ అని తెలిపారు. ఆయన త్యాగానికి ప్రతీకగా అమరావతిలో అమరజీవి 58 అడుగుల విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆయన త్యాగం, స్ఫూర్తి తెలుగు జాతికి ఆదర్శమని అన్నారు.