అన్నమయ్య: రాయచోటిలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి నిర్వహించారు. ఆయన విగ్రహానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోమవారం ఘన నివాళులు అర్పించారు. డైట్ కళాశాల ఎదురుగా ఉన్న విగ్రహానికి పూలమాల వేశారు. మంత్రి మాట్లాడుతూ.. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు త్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు.