థాయిలాండ్లో ఒక భార్య తనను మోసం చేసిన భర్తకు విడాకులు ఇవ్వడానికి బదులు ప్రియురాలికే అద్దెకు ఇస్తానంటూ వింత ప్రతిపాదన చేసింది. 10ఏళ్ల వివాహ బంధం తర్వాత భర్త అక్రమ సంబంధాన్ని గుర్తించిన ఖున్ క్వాంగ్, వారు విడిపోలేమని చెప్పడంతో నెలకు రూ.85 వేల అద్దె చెల్లించాలని డిమాండ్ చేసింది. ఈ ఒప్పందానికి ప్రియురాలు అంగీకరించినప్పటికీ, భర్త మాత్రం సమ్మతించకపోవడం చర్చనీయాంశమైంది.