KNR: గంగాధర మండలంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీజేపీ నేతలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు పంజాల ప్రశాంత్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో వితంతు, దివ్యాంగుల పెన్షన్లు అందించడంలో & నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని, ఆరు గ్యారెంటీ హామీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు.