AP: YCP అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి హాజరై స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. పార్టీ నిలబెట్టిన అభ్యర్థి గెలుపు కోసం పనిచేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. ‘త్వరలోనే ఓటర్ల సవరణ ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి.. ఎక్కువ స్థానాలు గెలిచేలా చూసుకుందాం’ అని ఆయన పేర్కొన్నారు.