NGKL: ఎండల తీవ్రతతో నల్లమల అడవుల్లో మంటలు చెలరేగుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే 50 చోట్ల కార్చిచ్చు రగిలింది. గతేడాది 1,026 హెక్టార్ల అడవి దగ్ధమైంది. వీటికి కారణం 80% ప్రమాదాలు మానవ తప్పిదాలేనని అధికారులు తెలిపారు. దీంతో ప్రమాద నివారణకు 29 బేస్ క్యాంపులు, 94 ఎయిర్ బ్లోయర్లతో నిఘా ఏర్పాటు చేశారు. శాటిలైట్ సాయంతో మంటలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ అదుపు చేస్తున్నారు.