ADB: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశం మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అదనపు కలెక్టర్ రాజేశ్వర్ ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి 85 వినతులు అందాయని పేర్కొన్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి అర్జీలను సత్వరమే పరిష్కరించాలని సూచించారు.