JGL: ప్రజావాణిలో వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ బీ. రాజ గౌడ్ అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణిలో ఆర్డీవోలతో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. అధికారులు అర్జీలపై సమగ్ర విచారణ జరిపి పెండింగ్లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ప్రజావాణికి మొత్తం 57 ఫిర్యాదులు వచ్చాయన్నారు.