ATP: వజ్రకరూరు గ్రామపంచాయతీలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు ఉగాది పండుగ సందర్భంగా నిత్యవసర సరుకులను సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మోనాలిసా మాట్లాడుతూ.. వజ్రకరూరు గ్రంథాలయ అధికారి శ్రీనివాసులు తన సొంత నిధులతో పారిశుద్ధ్య కార్మికులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.