ములుగు జిల్లా ఆసుపత్రిలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(ఏవో)గా మల్లెల ఉమ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవిని చేపట్టిన తొలి ఆదివాసి మహిళగా ఆమెను ఆదివాసి ఉద్యోగుల సంఘం, తుడుం దెబ్బ నాయకులు శాలువాతో సన్మానించారు. ఆరోగ్యశాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా చేరిన ఉమ పలు పదోన్నతులు పొంది ఈ స్థాయికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.