PPM: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఎన్. ప్రభాకర రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజల ఏ నమ్మకంతో కలెక్టర్ కార్యాలయానికి వస్తారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని అధికారులకి సూచించారు. సోమవారం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ మందిరంలో పాల్గొని 110 మంది అర్జీదారుల నుండి వినతులను స్వీకరించారు.