ప్రపంచ క్రికెట్లో భారత జట్టు ఆధిపత్యం ప్రదర్శించాలని తాను కోరుకున్నట్లు భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలి రాజ్ తెలిపింది. ఇప్పుడు తన కల నెరవేరినట్లు చెప్పింది. గత రెండేళ్లలో భారత పురుషులు, మహిళల జట్లతో పాటు అండర్-19 జట్లు కూడా సత్తా చాటాయని పేర్కొంది. భారత క్రికెట్ ఇలా ఎదగడం చాలా గర్వంగా అనిపిస్తోందని చెప్పుకొచ్చింది.