కృష్ణా: భాషా ప్రయుక్త రాష్ట్రాల సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు అని MLA యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. ఆయన 125వ జయంతి సందర్భంగా MPDO కార్యాలయంలో చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అమరావతిలో ఏర్పాటు చేసిన 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించారు.