KDP: ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడమే మా లక్ష్యమని ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. 15వ డివిజన్ నిరంజన్ నగర్లో నిర్వహించిన “అక్షరం అండగా – పరిష్కారమే అజెండాగా” కార్యక్రమంలో ప్రజలతో నేరుగా మాట్లాడారు. డ్రైనేజీ, తాగునీరు, మౌలిక వసతుల సమస్యలను తెలుసుకున్నారు. వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.