MLG: మంత్రి సీతక్కపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు క్రాంతి హెచ్చరించారు. గోవిందరావుపేటలో యూత్ కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశంలో క్రాంతి మాట్లాడుతూ… అనునిత్యం పేద ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తూ ముందుకు సాగుతున్న సీతక్కపై కావాలనే దుష్ప్రచారాలు చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.