నంద్యాలలో ఈ నెల 17 నుంచి 19 వరకు జరిగే సీఐటీయూ 17వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా కార్యదర్శి టీ. శివరాం మంగళవారం పిలుపునిచ్చారు. ప్యాపిలిలో కార్యక్రమానికి సంబంధించి పోస్టర్లను ఆవిష్కరించారు. మహాసభల్లో కార్మిక సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నట్లు తెలపారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు.