E.G: విద్యతోనే అభివృద్ధి జరుగుతుందని దేవరపల్లి సొసైటీ ఛైర్మన్ ఉప్పులూరి నోమేంద్ర రామారావు అన్నారు. దేవరపల్లి స్థానిక దళిత వాడలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.