SDPT: కొమురవెల్లి ఆలయ ప్రాంగణంలో సోమవారం ఓ వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలిని దూల్మిట్ట మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన మీసా లచ్చవ్వ(80)గా పోలీసులు గుర్తించారు. ఆలయ సిబ్బంది సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న SI మహేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వృద్ధురాలి మృతికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు.