ADB: ఉట్నూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డా.బీ.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. డీసీసీ ఉపాధ్యక్షుడు లింగంపల్లి చంద్రయ్య మాట్లాడుతూ.. దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ అని అన్నారు. వారి ఆశయాలు కొనసాగించాల్సిన బాధ్యత నేటి తరాలపైన ఉందన్నారు.