అధికంగా చెమట పట్టడం వల్ల డీహైడ్రేషన్ ముప్పు ఉంటుంది. అందుకే ఈ సమస్యను తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు పాటించాలి. పచ్చిమిర్చి, మసాలాలు శరీర వేడిని పెంచుతాయి. కాబట్టి వీటిని తగ్గించాలి. టీ, కాఫీల్లోని కెఫీన్ శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. వీటిని నియంత్రించాలి.ఒత్తిడి తగ్గించుకోవాలి.గాలి తగిలేలా వదులైన కాటన్ దుస్తులు ధరించడం ఉత్తమం.