SRD: సిర్గాపూర్ మండలం పెద్ద ముబారక్ పూర్ గ్రామంలో నూతనంగా అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు గ్రామస్తులు సోమవారం భూమి పూజ చేశారు. అంతకుముందు సర్పంచ్ పద్మవిట్టల్, ఉప సర్పంచ్ ఆసం రాములు అంబేద్కర్ చిత్రానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇందులో మాజీ సర్పంచ్ సారా బాలయ్య, వార్డు సభ్యులు గైని నర్సింలు, హన్మయ్య, నర్వ అంజయ్య ఉన్నారు.