MBNR: తెలంగాణ రాష్ట్రానికి పట్టిన శని కాంగ్రెస్ పార్టీ అని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గఫ్లత్లో ఒకసారి ఎమ్మెల్యే అయ్యాడని విమర్శించారు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియదు అన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు మీకు బుద్ధి చెబుతారన్నారు.