NRPT: విద్యుత్ శాఖలో పని చేస్తున్న ఆర్టిజన్ కార్మికులను పర్మినెంట్ చేయాలని జిల్లా ఉపాధ్యక్షుడు కాశీనాథ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నారాయణపేట విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద ఆర్టిజన్ కార్మికులు చేపట్టిన సమ్మెకు మద్దతు తెలిపారు. గత 25 సంవత్సరాలుగా చాలీచాలని జీతాలతో పని చేస్తున్న కార్మికులను పర్మినెంట్ చేయాలని, శ్రమకు తగిన ఫలితం ఇవ్వాలని కోరారు.