MBNR: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉందని మహబూబ్ నగర్ మేయర్ గుమ్మాల మమత డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని 16 వ డివిజన్ బోయపల్లిలో బుధవారం ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు.