GDWL: ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అధికారులను ఆదేశించారు. బుధవారం ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డితో కలిసి అభివృద్ధి కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఖాళీల భర్తీ, మౌలిక వసతుల మెరుగుదలపై దృష్టి సారించాలని సూచించారు. సమస్యల పరిష్కారానికి వైద్యాధికారులు సమిష్టిగా కృషి చేయాలని అన్నారు.