MNCL: గ్రామంలో నీటి సమస్య తలెత్తకుండా బోర్లకు మరమ్మతులు చేయిస్తున్నామని లక్షెట్టిపేట మండలంలోని పాత కొమ్ముగూడెం గ్రామ సర్పంచ్ దుమ్మని సత్తయ్య తెలిపారు. గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు శుక్రవారం గ్రామంలోని పలు వార్డులలో పాడైన బోర్లను మెకానిక్ల సహాయంతో బాగు చేయించారు. వేసవి నేపథ్యంలో ప్రజలు నీటికి ఇబ్బంది పడకుండా బోర్లను బాగు చేయించడం జరిగిందన్నారు.