ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన వ్యక్తిగత హక్కుల రక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. తన అనుమతి లేకుండా పేరు, ఫొటోలు, వాయిస్ లేదా వీడియోలను వాణిజ్య ప్రయోజనాలకు వాడకూడదని ఆయన కోరాడు. గతంలో అమితాబ్ బచ్చన్, రజినీకాంత్ వంటి వారు కూడా ఇలాంటి హక్కులను పొందారు. బ్రాండ్ విలువ దెబ్బతినకుండా ఉండేందుకు బన్నీ ఈ నిర్ణయం తీసుకున్నాడు.