KMR: పెద్ద కొడప్ గల్ మండలం సీతారామ్ తండాకు చెందిన అమీనా బాయి (30)కి శనివారం పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108కి సమాచారం అందించారు. ఆసుపత్రికి తరలిస్తుండగా నొప్పులు అధికమవడంతో, 108 ఎమర్జెన్సీ టెక్నీషియన్ బాల్ రాజ్ అంబులెన్సులోనే చాకచక్యంగా ప్రసవం చేశారు. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.