WGL: GWMC శానిటేషన్ విభాగంలో పని చేస్తున్న కార్మికులు వేతనాల సమస్యపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇతర విభాగాల్లో పని చేస్తున్న సిబ్బందికి అధిక వేతనాలు లభిస్తుండగా, శానిటేషన్ కార్మికులు రూ.33 వేలే పొందాల్సిన పరిస్థితి ఉందని ఆరోపిస్తున్నారు. డ్రైనేజీ, శుభ్రత పనులు నిర్వహిస్తున్నప్పటికీ సమాన వేతనం ఇవ్వడంలేదని మండిపడుతున్నారు.