HYD: కుత్బుల్లాపూర్లో గుండె కోత మిగిల్చే సంఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక జ్ఞాన శ్రీ అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. గత నెల 31న ఆమె తండ్రి మృతి చెందాడు. అప్పటి నుంచి తీవ్ర మనస్థాపానికి గురైన యువతి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.