JN: జనగామ సమీపంలోని వీరన్నపేట స్టేజీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కూరగాయల వ్యాపారి మృతి చెందాడు. చేర్యాలకు చెందిన నరసింహులు అనే వ్యక్తి తన ద్విచక్రవాహనంపై ఆకుకూరల వ్యాపారం నిమిత్తంవెళ్తుండగా, జనగామ నుంచి సిద్దిపేట వైపు వెళ్తున్న కారు రాంగ్ రూట్లో వచ్చి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నరసింహులు అక్కడికక్కడే మృతి చెందాడు.