KMM: జిల్లాలో డిగ్రీ ప్రవేశాల కోసం దోస్త్ (DOST) తొలిదశ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైనట్లు ఎస్ఆర్బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మొహ్మద్ జాకీరుల్లా తెలిపారు. మే 7వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉందని, ఏప్రిల్ 30 నుంచి మే 8 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని పేర్కొన్నారు. సందేహాల నివృత్తికి కళాశాల హెల్ప్‌లైన్ కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు.