TG: రాష్ట్రంలో వాహన సేవలను డిజిటలైజ్ చేసేందుకు ‘వాహన్’ పోర్టల్ ను దశలవారీగా అమలు చేస్తున్నట్లు రవాణాశాఖ తెలిపింది. ఎన్ఐపీ సాంకేతిక బృందం సహకారంతో రానున్న 15 రోజుల్లో పోర్టల్ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయని వెల్లడించింది. అయితే ఫ్యాన్సీ నంబర్ వేలంపాటల మాడ్యూల్ కూడా ప్రారంభమైందని పేర్కొంది.