BDK: అశ్వారావుపేట మండలంలోని రైతు వేదిక సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య మూడుకు చేరింది. తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో వ్యక్తి శుక్రవారం కన్నుమూశారు. మృతుల్లో మోడల్ కాలనీకి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ చిట్టూరి చుక్కయ్య, ఊట్లపల్లికి చెందిన కోవాసి నాగరాజు, మడకం సంతోష్ ఉన్నారు.