భారత స్టార్ బౌలర్ అర్ష్దీప్ సింగ్ T20 క్రికెట్ ఎలైట్ లిస్టులో చేరాడు. అంతర్జాతీయ T20లు, అలాగే IPLలో 100+ వికెట్లు తీసిన నాల్గో ఆటగాడిగా నిలిచాడు. భారత్ తరఫున 127* వికెట్లు పడగొట్టిన అర్ష్దీప్ IPLలో 102* వికెట్లు తీశాడు. అతని కంటే ముందు లంక దిగ్గజం లసిత్ మలింగ(107 & 170), బుమ్రా(121* & 183*), రషీద్ ఖాన్(193* & 163*) ఈ ఫీట్ నమోదు చేశారు.