MLG: “ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక”లో భాగంగా మంగపేట మండల కేంద్రంలోని PHCలో SI సూరి ఆధ్వర్యంలో ఆటో, స్కూల్ బస్సు డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా SI మాట్లాడుతూ.. డ్రైవర్లు కంటి చూపు సరిగా ఉంటేనే సురక్షిత ప్రయాణం సాధ్యమని, ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఉన్నారు.