AP: శ్రీసత్యసాయి జిల్లాలో గ్యాస్ పేలుడు ఘటనపై హోంమంత్రి అనిత స్పందించారు. కలెక్టర్, ఎస్పీతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గ్యాస్ పేలి నలుగురు మృతి చెందడం అత్యంత బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయాలైన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.