ATP: పేదల ఆకలి తీర్చేది మన సీఎం చంద్రబాబు నాయుడని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. బుధవారం ఉరవకొండ పట్టణ కేంద్రంలో నూతనంగా నిర్మించిన అన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు. అనంతరం అన్న క్యాంటీన్‌కి వచ్చిన ప్రజలతో కలిసి మంత్రి కేశవ్ భోజనం చేశారు. ప్రతి పేదవాడికి మూడు పూటలా కడుపు నిండా అన్నం పెట్టాలన్నదే కూటమి ప్రభుత్వం ఆశయమన్నారు.