TG: గత ప్రభుత్వం దళితులంటే ఓర్వలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మంత్రి వర్గంలో దళితులకు, గిరిజనులకు వారిచ్చిన స్థానం ఏంటో ఒక్కసారి ఆలోచించాలన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు, తప్పులను తాము సరిదిద్దుతుంటే.. కొంతమంది వెనకాల నుంచి కుట్రలు చేస్తూ గోతులు తవ్వుతున్నారని విమర్శించారు. అలాంటి వారిని, నక్కజిత్తులోలను, నల్లికుట్లోలను మీరే ఏదో ఒకటి చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.