TG: డీలిమిటేషన్తో తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. దక్షిణాదికి రాజకీయంగా ఉనికి లేకుండా చేస్తున్నారని విమర్శించారు. ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి చెప్తే.. ఆలోచించకుండా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పొంగులేటి భూ దందాలకు పాల్పడినట్లు తన దృష్టికి రాలేదన్నారు. తనపై కూడా గతంలో ఎన్నో ఆరోపణలు చేశారన్నారు.