VKB: నవాబ్‌పేట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పంచాయతీ కార్యదర్శి నవనీత, స్థానిక నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి బాబాసాహెబ్ చేసిన సేవలు అనన్య సామాన్యమని వారు కొనియాడారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ, ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా నేతలు పిలుపునిచ్చారు.