TPT: సుళ్లూరుపేట బొగ్గుల కాలనీలో 150 దళిత, గిరిజన కుటుంబాలకు రూ.1.8 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన 2KW సోలార్ రూఫ్ టాప్ యూనిట్లను ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ప్రారంభించారు. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు వీటిని పూర్తిగా ఉచితంగా అందని, దీనివల్ల ఒక్కో కుటుంబం ఏడాదికి సుమారు రూ.20 వేల వరకు విద్యుత్ ఖర్చును ఆదా చేసుకోవచ్చని ఎమ్మెల్యే తెలిపారు. పేదల సంక్షేమమే ధ్యేయమని ఆమె పేర్కొన్నారు.