కేడీ: ది డెవిల్ మూవీలోని ‘సర్కే చునార్ తేరి సర్కే’ పాట వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై సింగర్ మంగ్లీ స్పందించారు. ‘అనుకోకుండా జరిగిన ఈ పొరపాటుకు క్షమాపణలు. ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం మాకు ఎప్పుడూ లేదు. జరిగిన దానికి చింతిస్తున్నాం. ఇలా మరోసారి జరగదు’ అని ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ పెట్టారు.