KMM: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమంతరావు విమర్శించారు. రామ నరసయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మండిపడ్డారు. ఉపాధి హామీ పథకం పేరు మార్చి మతాల మధ్య విద్వేషాలు చెలరేగేలా చేస్తున్నారని తెలిపారు.