AKP: లాభదాయక, సాంప్రదాయ పంటలపై రైతులు దృష్టి సారించాలని జిల్లా ఇంఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు. సోమవారం అనకాపల్లి మండలం వెంకుపాలెంలో రైతన్న మీకోసం కార్యక్రమంలో కలెక్టర్ విజయ కృష్ణన్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో 46.83 లక్షల మందికి అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేశామన్నారు. రైతు సంక్షేమం కోసం రూ.53 వేల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టామన్నారు.