రెండు రోజుల క్రితం హర్మూజ్ జల సంధిని దాటిన భారత ఎల్పీజీ నౌక శివాలిక్ గుజరాత్‌లోని ముంద్రా పోర్టును చేరుకుంది. మరో నౌక నందాదేవి కూడా త్వరలో భారత్‌ను చేరనుంది. ఈ నౌకల్లో సుమారు 92 వేల టన్నుల ఎల్పీజీ ఉంది. దేశంలో గ్యాస్ సరఫరాపై ఆందోళన వ్యక్తమవుతోన్న సమయంలో తాజా పరిణామం ఊరట కలిగిస్తోంది